Wednesday, September 13, 2006

రైతుల ఆత్మహత్యలపై సిఎం అంగీకారం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అంగీకరించారు. ఈ విషయంలో నిజాలను దాచిపెట్టకుండా తాము పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. ఆత్మహత్యలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 303 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని, తాము అధికారంలోకి వచ్చాక 1501 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయదారులకు రోజుకు ఏడు గంటలసేపు విద్యుత్‌ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్లపై దాడి చేస్తున్న రైతులను ఆయన విమర్శించారు. వారు రాజకీయ రైతులని ఆయన అభివర్ణించారు.