Thursday, September 21, 2006

మనకు బతకడం రాదు అన్నోడు....!!!!

మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మనుశులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనకు పని చేసుడు శాతకాదు అన్నోడు, మనది తెలుగే కాదన్నోడు శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.
-నవీన్ ఆచారి

27 comments:

రానారె said...

ఇంతకీ ఎవడండీ వాడు!?

barb michelen said...

Hello I just entered before I have to leave to the airport, it's been very nice to meet you, if you want here is the site I told you about where I type some stuff and make good money (I work from home): here it is

naveen achari said...

@ రానారె

ఎవరు అంటావేంటి.. సాటి తెలుగు సోదరుడు. భాష ఒక్కటని పక్కన చేరి తెలంగాణ భాషను, యాస ను అవమనించే నీతిమాలిన వారు ఇంకెవరు ఉంటారు..వీరు కాక.

కత్తి మహేష్ కుమార్ said...

అందరు తెలుగు సోదరులూ తెలంగాణా యాస/భాషనూ, సంస్కృతినీ తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా మీరన్న మాట, మీకు జరుగుతున్నదంటున్న అవమానానికి సమానం కాదా? మిగతా అందరు (ఆంధ్ర,రాయలసీమ) తెలుగు వారూ నిజంగా అలా అనుకుంటున్నారంటారా!?!

naveen achari said...

అవును సోదరా..!! తెలంగాణ భాష ను అవమానించడం కన్నా అవమానించారు అని ఆ విషయాన్ని చెప్పడం ముమ్మటికి నేరం కదా. శభాశ్ సోదరులారా. మీకెవరూ సాటి రారు. ఆందరు ఎక్కడా అనుకోరు మిత్రమా నేను మట్లాడేది మెజారిటి గురించి. సీమ మాండలికాన్ని & ఉత్తరాంధ్ర మాండలికాలకు దక్కిన గౌరవం ఏమి లేదు. సీమ సోదరుల యాస అవమనించబడ్డదే. నాకు అర్థం కానిది ఎంటంటే మరి అలాంటివాళ్లతో కలిసి ఉండడానికి మీరు పాకులాడడమే...!!

కత్తి మహేష్ కుమార్ said...

మె...జా...రి...టీ నా!!! ఓటింగ్ ఎప్పుడుపెట్టి తేల్చారు మహాశయా? ఇక యాసని అవమానించడమంటారా, సీమమాండలికాన్ని కాస్త ఎద్దేవా చేసినా సాహిత్యంలో,వ్యావహారికంలో దానికున్న విలువ దానికుంది. అలాగే తెలంగాణా మాండలికానికూడా.

కేవలం ఏదో కొన్ని సినిమాలలో తెలంగాణా మాండలికాన్ని కామెడీ చేసినంత మాత్రానా,అందరూ అవమానించేస్తున్నారు కాబట్టి విడిపోతామనా మీ వాదన?

తమిళనాడులో,కర్ణాటకలొ,కేరళలో విబ్బిన్నమైన మాండలికాలు వ్యవహారంలో ఉన్నాయి. వాటి సొబగుల్ని ఆస్వాదిస్తూ కూడా వారు ఒక ప్రామాణికమైన భాషని కల్పించుకుని ఆనందించటం లేదంటారా! మనకెందుకింత చిన్న బుద్దులు...!?!

naveen achari said...

ఓటింగ్ పెడతారా ఆంధ్ర బిడ్డా..? తెలంగాణ యాసకు ఒకే భాష అని చంకలు గుద్దుకునే వారు ఇచ్చే విలువ ఏమిటొ.. తెలంగాణ వారికైతే తెలుసుకదా. ఆంధ్ర వాల్లు ఒప్పుకుంటే ఏం ఒప్పుకోకపోతేనేం..!!

పక్క రాష్ట్రాల గురించి చెప్పే అర్హత పక్క యాస కు మర్యాదనివ్వలేని గబ్బిలాలకు ఉంటుందా..?? గూడ్ కామెడి. గురూ.

కొన్ని సినిమాలా..?? సిగ్గు సిగ్గు.

భాష ఒక్కటని వేదాలు వల్లించే వారు పక్కయాస కు మర్యాద నివ్వడం నేర్చుకుంటే బాగుండేది.

సాహిత్యం లో దానికుండే విలువ దానికుంది అని చెప్పుకునే వారు.. ఎన్ని తెలుగు అకాడమీ పుస్తకాల్లో తెలంగాణ/ సీమ/ ఉత్తరాంధ్ర మాండలికాలు పెట్టారో చెప్పగలరా..?? సొల్లు చెప్పడం ఈజీనే నమ్మేవాళ్లుంటే.

Srikanth Babu శ్రీకాంత్‌ బాబు said...

masthu chapinavu naveen, ee andhra olaku aina ardham avuthundha antee

అబ్రకదబ్ర said...

తెలంగాణలోనే కరీం నగర్లో ఓ యాస, నిజామాబాద్ లో మరో యాస. వాళ్లలో వాళ్లు ఒకళ్ల యాస మీద మరొకరు జోకులేసుకుంటే తప్పు లేదు మరి! అలాంటి స్నేహితులు నాకు బోలెడుమందున్నారు.

naveen achari said...

@అబ్రకద్బ్ర

కరీం నగర్ లో ఒక యాస నిజామాబాద్ లో ఒక యాస ఉండదు. కొన్ని పదాలు తేడా ఉంటయి. వారేసే జోక్ కూడా ఆ పదానికి సంబందించింది మాత్రమే. అది కూడా లక్షల్లో ఒకటి. దాన్ని ఆంధ్రా వాళ్లు తెలంగాణ భాష ను సినిమాల్లో, వేదికల మీద, కాలేజ్ ఫంక్షన్స్ లో నిర్లజ్జగా వెకిలిగా అనుకరించి చూపడం తో పోల్చీ చూడడం అవివేకం, అజ్ణానం. ఇక ఆంధ్ర విషయానికి వస్తే వాడి ద్రుష్టి లో తెలంగాణ భాష తక్కువ భాష. అది పుస్తకాల్లొ ఉండడానికి కూడా పనికి రాదు.

కరీం నగర్ & నిజామాబాద్ లో కొన్ని పదాలు తప్ప భాష అంతా ఒక్కటే అని అంధ్రా బిడ్డలు గ్రహించాలి.

మీ ప్రవర్తన కు మీరు కారణం చెప్పుకోలేని అసమర్థులు వేరే వాళ్ల ను ఉదాహరణ గా చూపడం అవివేకం.

కళ్లుండీ చూడలేని భాషావేత్తలారా... ఇకనైన కళ్లు తెరవండి..!!

సమానత్వం అడిగితే దాన్ని 'చిన్నబుద్దీ' అనే భాషాప్రేమికుని ముసుగులోని ఒక ప్రాంతీయ మండూకాన్ని ఇంతకుముందే చూసాం. ఆయన ద్రుష్టిలో అంధ్రా తెలుగు ఆధిపత్యాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. మనం అన్ని ప్రాంతాల తెలుగు సమానమే అని ఉపన్యాసాలు ఇస్తాం. మరి తెలంగాణ లోని సాహిత్యాన్ని పాఠశాల పుస్తకాల్లో ఎందుకు పెట్టరు, పిల్లలకెందుకు చెప్పరు అని అడిగితే నొరెళ్లబెడతాం. బలవంతంగా మీ క్రిష్ణా గుంటూరు యాసను మాపై ఎందుకు రుద్దుతారు అన్న ప్రశ్న వింటే వారికి బీపీ పెరగగలదు. శభాశ్..

అబ్రకదబ్ర said...

నవీన్,

గుంటూరు, కృష్ణా యాసలు మీ మీద రుద్దారని అంతగా గింజుకుంటున్నారు. మరి మీరు తెలంగాణ యాసలో రాసుండొచ్చు కదా ఈ వ్యాఖ్యలన్నీ?

సంగతేమిటంటే, తెలంగాణ యాసలో మాట్లాడాలంటే మీకే నామోషీ. అది వేరే వాళ్ల మీదకి నెట్టటమెందుకు?

కత్తి మహేష్ కుమార్ said...

@నవీన్,
అబ్రకదబ్ర గారి వ్యాఖ్యతో నేను అంగీకరిస్తాను.మీరు చెబుతున్న వాటిలో అపోహలెక్కువ, నిజాలు తక్కువ.
తెలంగాణా భాష గురించి సామరస్యమైన చర్చ మేము కోరుకుంటే, మమ్మల్నికూడా ‘ఆంధ్రావాళ్ళూ’అని ఎద్దేవా చేసెయ్యడమే!అది మీ అసహనానికీ..కాంప్లెక్స్ కీ అద్దం పడుతోంది.

మాది చిత్తూరు...రాయలసీమవాడిని. కానీ మా చిత్తూరుకి,కడపకి,అనంతపురంకు,కర్నూలుకీ మధ్య గల యాసలూ/భాషల తేడాను చూసే, ఒక ప్రామాణిక భాష కావాలి అంటున్నాను.

ప్రస్తుతం ప్రామాణికమనుకుంటున్న తెలుగు బలవంతంగా రుద్దిన, కృష్ణా జిల్లా భాష అని అంటున్నారు.మీరెప్పుడైనా విజయవాడ వెళ్ళి విన్నారా? ఆ యాసే వేరు. ఆంధ్రా ప్రాంతంలో కూడా జిల్లాకొక యాస,భాషా సంస్కృతీ ఉన్నాయ్.

కూపస్థమండూకాలు మేము కాదు, మీరే. కనీసం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిచూడకుండా (వినకుండా) అపోహల్ని గుండెలకదుముకుని, నిజాలని మురిసిపోతున్నారు. కళ్ళుతెరవండి.

తమిళ,కన్నడ,మళయాళం వారిగురించి మాట్టాడే హక్కు నాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 6 సంవత్సరాలు వీరి భాషా సంస్కృతిని గమనించిన అనుభవం నాకుంది.

naveen achari said...

@ అబ్రకదబ్ర

నేను ఆంధ్రా వాళ్లతో కదా మట్లాడుతున్నది. నువ్వు ఆంధ్రా వాడివే కదా. నీకు అర్థం కావాలంటే నీ భాషలోనే కదా రాయాలి.

నాకు నీ భాష ఎలాగు అర్థం అవుతుంది కాబట్టి నేను కష్టపడాల్సింది ఏమి లేదు. ఎందుకంటే మనందరిది తెలుగే అంటున్న దొంగలు బడి పుస్తకాల్లో మాత్రం అంధ్రా భాషనే కధా పెట్టింది.

అంధరిధి తెలుగే అని మొరిగే వాళ్లు, అందరి సాహిత్యం విలువైనదే అని నీతులు వల్లించే వాళ్లు, బడి పుస్తకాల్లో మత్రం అంధ్రా యాసే ఎందుకు పెట్టారంటే దిక్కులు చూస్తున్నారు. దానికి సమాధానం చెప్పుకోలెని అసమర్థులు. మీ భాష మీకే నామోషి అని అంటున్నారా.

అడిగినదానికి సమాధానం ఇవ్వడం చేతకని మూర్ఖుల్లారా..!! మిమ్మల్నెవరు ఇబ్బంది పెట్టలెదు కదా జవబిమ్మని. తెలియకపొతే ముసుకుని ఉండొచ్చు నష్టం ఎమీ లేదు.

ఎం క్రిష్ణా గుంటూరు యాస ను తెలంగాణ పిల్లలపై రుద్దలేదా..? ఆ మాట అంటే గింజుకోవడం అంటారా..? సిగ్గుండాలి.

naveen achari said...

మహేష్

ఆంధ్రా వాళ్లను అంధ్రా వాళ్లు అనడం తప్పా..? నేను తెలంగాణ వాన్ని. ఎవరైనా నన్ను ఎవరైన తెలంగాణ వాడివి అనడం "ఎద్దేవా అవుతుందా".

ఒకడి భాషను ఇంకోడు ఎగతాళి చేస్తున్నాడ్రా మూర్ఖా అంతే.. అది అంతే దాని సొబగుల్ని ఆస్వాదించాలని చెప్పే వాళ్లది అసహనం కాదా. కేవలం పని గట్టుకొని కొన్ని ప్రాంతాల్లో వాడే యాసను అవమనిస్తున్నారంటే మాటవరుసకైనా తప్పు అనలేని వాళ్లది అసహనం కాదా..? పక్కవాడ్ని గౌరవించలేని మనుశులు ఎన్ని కళాత్మక డైలాగ్ లు కొట్టినా మీ బుద్దిలేనితనాన్ని దాచిపెట్టుకోలేరు.

ఆ రాష్ట్రాల్లో ఆరేళ్లు ఉంటేనేం అరవై యేళ్లు ఉంటేనేం పక్క వాడి యాసను గౌరవించాలని తెలియనప్పుడు. అర్హత నీ సీనియారిటి తో కాదు.. నువ్వు నేర్చుకున్న విషయాలతో వస్తుంది.

నువ్వు చెప్పే ని ప్రామాణిక భాష అనే పదం ఎంటొ కూడా నికు తెలియని అజ్ఞానికి ఇంతకన్నా ఇంకేం చెయగలం. చిత్తూరు & కర్నూలు కు తేడాలుంటే కొన్ని పదాలు కర్నూలువి కొన్ని పదాలు చిత్తూరువి తీసుకుని చెయ్యాలి. అంతే కాని ఒక జిల్లా వాడి భాష నే ప్రామాణికం అని ప్రకటించి అందరు అదే నేర్చుకోవాలని చెప్పడం ఔలా తనం మత్రమే.


ఇప్పుడు మనం మాట్లాడె భాషలో 97% పదాలు క్రిష్ణా, గుంటూరు, తూ.గో, ప.గో లో వాడేవే. కాదంటావా...?? తెలంగాణ లో మత్రమే వాడే పదాలను నీ ప్రామాణిక తెలుగులో చూపించగలవా..?? కేవలం ఆంధ్ర లో వాడే పదాలను నెను దాంట్లో వేలకొద్దీ చూపిస్తా.

నువ్వు మాట్లాడేది తప్పు అని తెలియక మాట్లాడడం అజ్ఞానం. తప్పు అని తెలిసి మాట్లాడడం మూర్ఖత్వం.

ఎవరు కూపస్థ మండుకాలు.. పలానా భాషే ప్రామాణికం అని చెప్పే ముర్ఖులా..? అన్ని యాసలకు ప్రాతినిథ్యం ఉండాలనే వారా..?? అందరికీ సమాన (లేదా కనిసం దానికి దగ్గరగా) ప్రాతినిథ్యం అడిగితే 'చిన్నబుద్దీ' అనే మూర్ఖుల్ని మించిన మండూకాలు ఉండగలవా..??

Srikanth Babu శ్రీకాంత్‌ బాబు said...

కత్తి మహేష్ కుమార్ jara idhi kudha chadhuvu ..

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.
‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు

సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు
సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు
దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు
బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు
రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు

తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు
వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము
భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు
భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు
కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి
ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు
భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న

-కాళోజి

bolloju ahmad ali baba said...

సోదరా నవీన్
మద్యలో ఎక్కడో అబ్రకదబ్ర గారు అడిగినట్లు ఒక్క నీ పోష్టు తప్ప కామెంట్లన్నీ ప్రామాణికమైన భాషలో ఎందుకు రాస్తున్నారు. ఎందుకంటే ప్రామాణికమైన భాషలో ఉన్న సౌలభ్యం అది. అందరికీ అర్ధం అవుతుంది. అదిలాబాద్ నుంచి అనంతపురం దాకా ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోగలరు.
మా తూర్పు గోదావరి జిల్లాలో వాడుకలో వాడే చాలా పదాలు ఈ ప్రామాణిక భాషలో దొరకవు. బహుసా ఇదే పరిస్థితి అన్ని జిల్లాలకు వర్తిస్తుంది అని నా అభిప్రాయం.
అదే విధంగా ఫ్రెంచివారిచే పరిపాలింపబడిన యానంలోని పాతతరం ప్రజలు ఇప్పటికీ కొన్ని ఫ్రెంచి పదాలను నిత్యజీవితంలో వాడుకుంటూ ఉంటారు. దానికేమనగలం. వాళ్లూ తెలుగు వాళ్లె మరి.

భాష అనేది ఒక జీవనది. కలిసేది కలుస్తూ ఉంటుంది, పోయేది పోతూ ఉంటుంది. ఇలా కలుపుకోగలిగేదే ఎక్కువకాలం మనగలుగుతుంది. (ఈ వాఖ్య ఆంద్ర యాసకేకాదు తెలంగాణా యాసకూ వర్తిస్తుంది.)
ప్రతీ ఏటా కొన్ని వందల పదాలను కలుపుకుంటూ పోతుంది కనుకనే ఈ రోజు ఇంగ్లీషు దాదాపుగా రారాజుగా వెలుగొందుతుందని నా అభిప్రాయం.
సంస్కృతం కనుమరుగైపోవటానికి కారణం ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ లేకపోవటమే అని అంటారు.

ఏతా వాతా ఒక భాష యొక్క ఎక్కువతక్కువలను వ్యక్తులు నిర్ణయించటం తగదు. కాలం నిర్ణయించాలి. అవును ఖచ్చితంగా కాలమే నిర్ణయించాలి. మనం కాదు.
ఇవన్నీ శుష్క వాదనలు.

బొల్లోజు బాబా

అబ్రకదబ్ర said...

నవీన్,

"నువ్వు ఆంధ్రా వాడివే కదా. నీకు అర్థం కావాలంటే నీ భాషలోనే కదా రాయాలి". "నాకు నీ భాష ఎలాగు అర్థం అవుతుంది కాబట్టి నేను కష్టపడాల్సింది ఏమి లేదు"

నేనాంధ్రావాడినని, నాకు తెలంగాణ యాస అర్ధం కాదు అని ఇప్పుడే తెలిసింది. తెలియజేసినందుకు ధన్యవాదాలు. నాగురించి మరేమన్నా విశేషాలు తెలిస్తే చెప్పండి, సంతోషిస్తాను.

ఆంధ్రప్రదేశ్ లో రెండు జిల్లాల వాళ్ల భాషని మిగతా ఇరవయ్యొక్క జిల్లాల మీదా బలవంతాన రుద్దుతుంటే నోరుమూసుకుని కూర్చునేవాళ్లెవరు? అంత బలం నిజంగానే గుంటూరు, కృష్ణా ప్రజలకుందా? అనవసరంగా ఆవేశ పడకండి.

వాద ప్రతివాదాలు ఆరోగ్యకరంగా ఉంటే మంచిది. ఎదురు చెప్పిన వారిపై 'మూర్ఖులు', 'నీతిమాలినవాళ్లు', 'గబ్బిలాలు' అని నోరుపారేసుకోవటం, ఎదుటి వ్యక్తిని ఏకవచనంలో సంబోధించటం .. నాకు తెలిసిన తెలంగాణ మర్యాదలివి కావు. మీరు చెప్పేదాంట్లో విషయముంటే వ్యక్తిగత దూషణలకు దిగాల్సిన అవసరం లేదు.

naveen achari said...

@ అబ్రకదబ్ర

"ఎదుటి వ్యక్తిని ఏకవచనంలో సంబోధించటం .. నాకు తెలిసిన తెలంగాణ మర్యాదలివి కావు." ..నేను ఆంధ్రా వాన్ని ఐనా నాకు తెలంగాణ గురించి అంతా తెల్సు అని మీకు మీరే చంకలు గుద్దుకునే మేధావుల్లారా.. మీకూ తెలిసింది ఏమీ లేదూ అని నీ మాటల్లోనే అర్థం అవుతుంది. ఏంటి నీకు తెలిసిన మర్యాదలు. తెలంగాణ లో ఒక మనిషిని సంబొదించేటప్పుడు బహువచన ప్రయోగం లేదు. నాకన్ని తెల్సు అని అనుకోవడం అజ్ఞానం కాగలదు. తస్మాత్ జాగ్రత్త. నీ స్థాయి ఇది కాబట్టే నీ భాష లో రాయాల్సి వచ్చింది. నాకు అన్ని తెలుసు అనే అహంకారం విడిచిపెట్టి తెలంగాణ యాస గురించి తెలిస్తేనే తెలుసని చెప్పు. అనవసరపు పేరు కోసం పాకులాడకు. నీ గురించి ఏమన్నా విషయాలు తెలిస్తే రాయమన్నావ్. నీకు తెలియనిది కూడా తెలుసు అని చెప్పుకునే హ్రస్వ దృష్టి నీకుంది. అదే పెద్ద విశేశం.

ఇక ఆ నాలుగు జిల్లాలకు అంత శక్తి లేకపోవచ్చు. ఐతే ఇప్పుడు ప్రామాణిక భాష అని చెప్తుంది మాత్రం ఆ జిల్లాలదే. ఏం కాదనగలవా..?? రాష్ట్రం లోని కవులు, రచయితల్లో ఎక్కువగా (ప్రభుత్వం చే గుర్తించబడ్డ) అక్కడివారే.

విషయం ఏంటంటే ఆ జిల్లాల భాష మిగతా వాళ్లందరికి అధికార భాష గా ఉంది. తప్పో ఒప్పో వాస్తవం కాబట్టి అంగీకరించాలి. కల్లుండీ చూడలేని గుడ్డి వాళ్లలాగానే ఉంటాం అనడం, అన్నీ భాషలకూ సమాన ప్రాతినిధ్యం ఉందీ అని వాదించడం కరెక్ట్ కాదు.

నేను చెప్పేదాంట్లొ విసయం ఉంది కాబట్టే మీరు దానికి సమాధానం ఇవ్వడం చేతకాక ఇలా వేరే విషయాలపై పడ్డారు. నీకు చేతనైతే మనం మళ్లీ మొదటి 4 లేదా 5 పోస్ట్ ల మీద చర్చిద్దామా..?

naveen achari said...

బాబా గారికి..

నేను ప్రామాణిక భాషను వ్యతిరేకించత్లేదు.ఐతే ఏది ప్రామాణికం అన్నదే ప్రశ్న. మీ తూగో జిల్లాలోవాడే కొన్ని పదాలు ప్రమాణిక తెలుగులో ఉండవన్నాౠ. ఇక తెలంగన లోని 10 జిల్లాల్లో మత్రమే వాడే ఈ ఒక్క పదం కూడా నువ్వు చెప్పే ప్రామాణిక తెలుగు లో లేదు. ఎంత దారుణం. ఈరోజు ప్రామాణిక భాషగా చెప్పుకునే తెలుగు పూర్తిగా కొస్తాంధ్ర తెలుగే. దీంట్లో సీమ, తెలంగాణ మాండలికాలకు స్థానం లేదు. ప్రామాణిక భాష అవసరమే. ఐతే దీంట్లో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండాలనేదే నేననేది. నేను ప్రామాణిక భాష నూ వ్యతిరేకించట్లేదు అని మీరు తెలుసుకోకుండా ఎంత చెప్పినా కంఠశోశ తప్ప వచ్చేదేమిలేదు.

మీరన్నారు..భాష అనేది ఒక జీవనది. కలిసేది కలుస్తూ ఉంటుంది, పోయేది పోతూ ఉంటుంది. ఇలా కలుపుకోగలిగేదే ఎక్కువకాలం మనగలుగుతుంది. (ఈ వాఖ్య ఆంద్ర యాసకేకాదు తెలంగాణా యాసకూ వర్తిస్తుంది.)... అయ్యా తెలంగాణ యాస లో ఆంధ్ర పదాలు ఉన్నాయి. మీరు కలత చెందొద్దు. కన్నీరూ పెట్టొద్దు. తెలంగాణ భాషలో వాడే ఆంధ్ర పదాల్ని నేను చూపిస్తా. ఆంధ్ర లో వాడే తెలంగాణ పదం ఒకటి చూపిస్తావా..? మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ఐతే ఎన్ని నిజాలు మాట్లాడుతున్నం అని మనకు మనం ప్రశ్నించుకోవడమే వివేకం.

ప్రామాణికమైన తెలుగులో ఆంగ్ల పదాలు కలిసినయ్ కాని తెలంగాణ పదాలు కలవకపోవడం 10 జిల్లాల తెలుగు ప్రజల దురదృష్టం. యానాం గురించి, ఇంగ్లీష్ గురించి గురివింద నీతులు చెప్పేముందు మనను మనం చూసుకోవడం మంచిది. పరభాషా పదాలు కలుపుకోలేకపోవడం అక్కడితో ఆగకుండా భాషా సమగ్రం కావాలి. అది విశ్వజనీనం కావాలంటే అన్ని ప్రాంతాల తెలుగు పదాలు దాంట్లో ఉండాలి. ఈరోజు మేము ఆంధ్ర లో వాడే పదాలన్ని తెలుసుకున్నట్టు సీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర మాండలికాల పదాల గురించి కోస్తా సోదరులు తెలుసుకోవాలి. అలా జరగనప్పుడు ఎన్ని అధికారా భాషా సంఘాలు పెట్టినా ప్రయోజనం లేదు. అందుకేనేమో తెలుగు వాడుక తగ్గిపోతుంది. కాలం నిర్ణయించేది ఇదే. జరుగుతున్నదీ ఇదే.

సాహితీ యానం said...

సోదరా నవీన్
ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. నీ అభిప్రాయలను నేను మార్చలేనట్లు గానే నా అభిప్రాయలనూ మీరు మార్చలేరు.
తెలంగాణలో ఆంధ్ర పదాలున్నాయి కానీ ఆంధ్రాలో తెలంగాణా పదాలు ఎందుకు లేరు అని అన్నారు.
దీనికి నాకు అనిపించే కారణాలు.
ఒక భాష యొక్క వ్యాప్తికి వలసలు ప్రధాన కారణం అవుతాయి. దీనికి ఉదాహరణలుగా ఇంగ్లీషు ను చెప్పుకోవచ్చు.
ఒక భాష యొక్క వ్యాప్తికి సాహిత్యం మరొక కారణం. నాకు తెలిసి ఒక మిత్రుడు le miserables అనే ఒక ఫ్రెంచ్ రచన దాని మాతృకలో జదవటానికై, ఫ్రెంచి భాషను నేర్చుకున్నాడు.
ఈ రెండు విషయాల పట్ల మీరు పారదర్శకంగా ఉన్నారా?
ఆంధ్రా వాళ్లు చేసినన్ని వలసలు మీరు చేసారా? (వలసలు మంచివా కాదా అన్నది నా చర్చ కాదు. చారిత్రాత్మకంగా వలసలనేవి సాంస్కృతిక కలపోతకు దోహదపడతాయన్న ఒక సత్యం గురించే(
నాకుతెలిసి తెలంగాణ రచయితలైన, ధాశరధి సినారె, రంగాచార్య, పి.వి. వంటి దిద్ఘందులు ప్రామాణిక భాషలో తమ సాహిత్యాన్ని వెలువరించారు కానీ యాసలో కాదు. ఈ మద్య ఈ భాషా స్పృహ మొదలై మనతరం రచయితలు యాసలో వ్రాస్తున్నారు. (అంతకు ముందు ఎవరూ వ్రాయలేదని నేననటం లేదు- కానీ యావత్ దేశాన్ని ప్రభావితం చేసేటంత స్థాయిలో ఉండక పోవచ్చు, లేదా నా పరిధి చిన్నదైనా అవ్వచచ్చు.)
నేనిక్కడ ప్రత్యేక తెలంగాణా గురించి కూదా మాట్లాడటం లేదు. ఒక్క భాష గురించే.
ఒక భాష విస్త్రుతంగా వాడబడటానికి కారణాలైన వలసలు, సాహిత్యం వంటి ప్రక్రియలగురించే మాట్లాడుతున్నాను.
మీ భాషపట్ల మీ కున్న మమకారాన్ని, దాన్ని విస్త్రుతపరచాలన్న ఆకాంక్షను సఫలీకృతం చేసుకోవాలంటే ముందు మీరీ పనులుచెయ్యండి.
ఆ తరువాత కాలం తనపని తాను చేసుకుపోతుంది.
మీ ఊళ్లో ఎముకలను బొక్కలు అంటారు అనుకుంటా. అదే మాట ఇక్కడ బూతు మరి. మేము మీఇంటి పక్క ఉండే టత్లయితే మాపిల్లలు ఎముకలను బొక్కలనొచ్చు, లేదా మీరు మాఇంటిపక్కనుండేటట్లయితే, మీపిల్లలు బొక్కలను ఎముకలనొచ్చు. ఇదేవిషయాన్ని నేను చెప్ప దలచుకున్నాను.

అందుకనే ఈ వాదనలన్నింటిని శుష్కవాదనలని అభిప్రాయపడింది.
కాలమే భాష భవితవ్యతను అంతిమంగా నిర్ణయిస్తుంది అన్న విషయాన్ని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.

http://www.tadepally.com/2008/06/blog-post_01.html్
అనే చోట నా యొక్క మరికొన్ని అభిప్రాయాలను తెలియచేసాను. ఆశక్తి కలిగితే చూడండి.

బొల్లోజు బాబా

సాహితీ యానం said...

క్షమించు చిన్న కొనసాగింపు
ఈ రోజు ఇంగ్లీషు భాషలోకి సమోసా, ఖీర్, బిర్యాని, పులావ్, వంటి పదాలు చేరాయంటే, అమెరికా, బ్రిటన్ ల మార్కెట్లను ఈ ఈ అయిటములు ముంచెత్తటం కాదు? ఎందుకుముచెత్తాయంటే మన భారతీయుల వలసలు కాదూ కారణం.
మరలా చెపుతున్నాను, నెనీ వాఖ్యలన్నీ భాషగురించే చేసాను, తెలంగాణా గురించి కాదు.
బొల్లోజు బాబా

కత్తి మహేష్ కుమార్ said...

అయ్యా నవీన్ గారూ,
సామరస్యంగా విషయం గురించి చర్చ చెయ్యక,పెడసరి సమాధానాలూ, అక్కసు వెళ్ళబోయడం మినహా మీరు చేస్తున్నది ఏదీ లేదు. పైగా వ్యక్తి ధూషణలు, మితిమీరిన మీఅగౌరవాన్ని చూసి, చింతించడం తప్ప ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.

ఒకవేళ మీలాంటి వారే ఇప్పటివరకూ తెలంగాణ మాండలికాన్ని భుజాలమీద మోసినట్టైతే,ఖచ్చితంగా మీరే ఈ స్థితికి కారణాలుగా అనిపిస్తోంది.

బయటివాళ్ళని (మేము అలా అనుకోవడం లేదు,మీకే అలా అనిపిస్తోంది) ఇలా కారణభూతులంటూ దూషించడం మాని, అసలు భాష యొక్క పరిణామాన్నీ, ప్రగతినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానిలో తెలంగాణా మాండలికాన్ని కాపాడుకునే మార్గాలు మీకు కానరావచ్చు.కాకపోతే మీరెంచుకున్న ఈ మార్గం మాత్రం ఖచ్చితంగా మీ గమ్యాన్ని చేర్చదు.

www.parnashaala.blogspot.com

naveen achari said...

@ బాబా గారు..

ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. నిజమే. ఐతే నేను అభిప్రాయాల గురించి మాత్రమె చెప్పట్లేదు. ప్రామాణిక తెలుగు అని చెప్పబడేది కెవలం నాల్గు లేదా ఐదు జిల్లాల భాష మాత్రమే అంటున్న. ఇది నిజం ఐనా కావాలి. అబద్ధం ఐనా కావాలి. అభిప్రాయం మాత్రం కాదు. టెలంగాణ పదాలు మీరు చెప్పే ప్రామాణిక తెలుగులో లేవు అంటున్నా. ఇది అభిప్రాయం కాదు. నిజం. కాదైతే ఎందుకు కాదో చెప్పు. అన్ని ప్రాంతాల తెలుగులో సాహిత్యం వచ్చినప్పటికీ కేవలం కొన్ని ప్రాంతాల సాహిత్యాన్నే బడి పుస్తకాల్లో పెట్టారు. ఇది నిజం. కొన్ని ప్రాంతాల భాష లో రాస్తేనే అవార్డులిస్తారు. ఇదీ నిజమే. అభిప్రాయం కాదు.

వేయి ఆలోచనలు సంఘర్షించనీ.. నూరు పూలు వికసించనీ అన్నట్టు...నిజాన్ని ఒప్పుకోవడం లోనే మనిషి ఔన్నత్యం ఉంటుంది.

రెండు వేర్వేరు భాషలకు ఐతేనే నువ్వు చెప్పేది ఎక్కువగా వర్తిస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పిన సమోసా, ఖీర్, బిర్యాని, పులావ్ వంటి పదాలనే చూస్తే వాటికి ఆ భాష లో సమానర్థాలు లేవు. ఇవి వస్తువుల పేర్లు. వీటికి ఒక్కో భాషలో ఒక్కో పేరు ఉండదు. ఈ వస్తువులు భారతదేశం నుండి అక్కడికి వెళ్లాయి. కాబట్టి ఈ పేర్లతోనే పిలవాల్సి ఉంటుంది. నూడుల్స్ ను నూడుల్స్ అనే అనాలి (ఇది చైనా ది). బర్గర్ ను బర్గర్ అనే అనాలి. వీటిని వేరే పేర్లతో పిలవలేం. మనం కొత్త పేర్లు పెట్టలేం. ఇది సాధారణ విషయమే. ఐతే భావాల వ్యక్తీకరణ కు వారు హిందీ పదాలు వాడుతున్నారా అనేది అలోచించండి. ఉదా: ఆకలి, కోపం, వాన, పో, రా, కూర్చో లాంటివి ఎన్ని పదాలు హింది నుండి ఇంగ్లీష్ లోకి వెళ్లాయి..?

మహారాస్ట్ర నుండి వేలాది కుటుంబాలు నిజామాబాద్ జిల్లాలో స్థిరపడ్డప్పటికీ ఆ ప్రాంత తెలుగులో అవి కనిపించవు. (ఉన్నా 10 పదాల లోపే).

ఉర్దూ ప్రభావం తెలంగాణ లో రావడానికి కూడా అది అధికార భాషగా ఉండడమే కారణం కాని వారి వలస కాదు. ఎందుకంటే ఉర్దూ అధికార భాష కాక మునుపు తెలుగు లో ఉన్న ఉర్దూ పదాలు శూన్యం. ఇక అదే దారిలో లంబాడీల భాష. వారు తెలంగాణ లోని ప్రతి జిల్లాలో ఉన్నప్పటికి తెలుగు భాష పై దాని ప్రభావం లేదు.

తెలంగాణ లొంచి అంధ్రా లోకి వెళ్లిన వారి భాషా పదాలు ఎన్ని కలిసాయి అంధ్ర లో..? కనిసం ఒక 5 పదాలు చూపించ గలరా..?? తెలంగాణ లో అంధ్ర పదాలకు కారణం ఆంధ్రులు రావడం కాదు. ఆంధ్ర భాష అధికార భాష కావడమే ఇందుకు కారణం. అది బడి పుస్తకాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో వాడడం తో అధి మిగతా ప్రాంతాల సాహిత్యం లోకి వచింది. మెల్లమెల్లగా అదే నిజమైన భాష అనే భావన స్థిరపడ్డది. మళ్లీ ఈ మద్య కాలంలో తెలంగాణ భాష లోనే ఇక్కడి కవులు రచనలు చేస్తున్నారు. చిల్లర దేవుల్లు లాంటి సాహిత్యం తెలుగులో ఆగిపోయిన మాట నిజమే కదా. అల్లం రాజయ్య తర్వాత మళ్లీ అలాంటి వారు ఎంతమంది ఉన్నారు. సినారే లాంటి ప్రసిద్ద కవులు కూడా అంధ్ర భాషనే ఆశ్రయించాల్సి వచ్చింది.

మీరు చెప్పే కారణాలన్నీ మనకు మనం చెప్పుకునే ఓదార్పులు మాత్రమే.

వలసలు కారణం ఐతే రెండు ప్రాంతాల్లో అదే పరిస్థితి ఉండాలి కదా. కేవలం ఒకరి భాష మొత్తం మారిపోవడము, ఇంకొకరి భాష లో ఒక్క పదం కూడా చేరకపోవడమూ విచిత్రంగా లేదా..!!

కాబట్టి ఆంధ్ర తెలుగు తెలంగాణ లో ప్రవేశించడానికి కారణం వసలు కాదు. అసలు కారణం అధికార భాషగా ఒక ప్రాంతపు తెలుగు చలామని కావడమే. పాఠ్య పుస్తకాల్లో, పాలనా వ్యవహారాల్లో చేరడమే..!!

naveen achari said...

సోదరా మహేశ్..

సామరస్యంగా చర్చించాలి అని నువ్వు చెప్పడం వినడానికి బాగానే ఉంది. ఐతే ఆ చర్చ లో నువ్వు చెప్పిన ఎన్ని విషయాలకు నువ్వు సమాధానం ఇచ్చావన్నది ఆలోచించుకుంటే మంచిది. వ్యక్తిగత దూషణలకు కారణం అన్ని ప్రాంతాల భాషలకు సమాన ప్రాతినిథ్యం ఉండాలి అన్న వారిది "చిన్నబుద్ది" అని నువ్వనడమే.


అవును సోదరా. నువ్వు చెప్పింది నిజం. మనకు చర్చ లో విషయానికి సంబందించింది ఎమీ లేనప్పుడు ఇలాగే చెప్పాలి. నువ్వు చేస్తుంది కరెక్ట్. తెలంగాణా భాష కు సముచిత స్థానం లభించక పోవడాన్ని నాతో ముడిపెట్టావంటేనే తెలుస్తుంది అసహనం నీదో నాదో. మరి కేవలం కోస్తా భాషనే అధికార భాష కావడానికి కొందరి నక్కజిత్తులే కారణం అని మాత్రం నేను చెప్పగలను. ఐతే వారు నీలాంటి వారు అని నేను అనను (నువ్వన్నట్టు). విషయాన్ని విషయం తోనే చర్చించడం వాంఛనీయం.

ఏమిటీ..భాష పరిణామాలనూ, ప్రగతినీ అర్థం చేసుకోవాలా..!! ఏమిటా పరిణామం..! ఎట్టిదా ప్రగతి..! వివరించ ప్రార్థన.. తెలంగాణ మాండలికాన్ని కాపాడు కునే మార్గాలు ఆ ప్రగతి లో కనిపిస్తాయా...? ఏ ప్రగతి లో ..!! ఇప్పుడు మీ భాషను అందరు చదవాల్సిన వచ్చిన ప్రగతిలోనా..!! అలాంటి ప్రగతి మాకు వాద్దన్నా. ప్లీజ్..సారీ..!! మా భాష మా వాళ్లు మాట్లాడుకుంటే చాలు. అందరికీ రుద్దాలని మేము కోరుకోవట్లేదు.

మేము ఈ మార్గం ఇన్ని రోజులు ఎంచుకోకనే కదా ఒక ప్రాంతపు భాష అధికార భాష ఐంది. ఇదే సరైన దారి. సీమ భాష అంటే ఫ్యాక్షనిస్టులధి.. తెలంగాణ భాష అంటే కమెడియన్లది అనే వాళ్లకు ఈ దారి లోనే సమాధానాలు దొరుకుతాయి.

బొల్లోజు బాబా said...

మీ కామెంటులో తెలంగాణా నించి ఆంధ్రాకు వచ్చిన వలసలు చాలా చాలా తక్కువనే విషయాన్ని తెలివిగా ఒమిట్ చేసారు.

అదేవిదంగా, ఇంగ్లీషులోకి వెళ్లిన బిర్యాని, సమోసాలాంటి పదాలెకాక, శాంతి, గురు, వరండా, పందికొక్కు వంటి పదాలు కూదా వెళ్లాయి. నాకుతెలిసినంత వరకూ ఇంగ్లీషు భాషలోకి ఇతరపదాల అడాప్టేషను మీరు చెప్పినంత " తప్పనిసరై" జరిగినది కాదు. అదొక సామ్రాజ్యవాద టెక్నిక్.

మీ సమాధానం లో కొన్ని కొన్ని మినహాయింపులు తప్ప, చాలామట్టుకు కన్వింసింగ్ గానే అనిపిస్తుంది. అలాగని దాన్ని స్వీకరించటానికి సిద్దంగా లేను. దీన్ని మీరు నా అహంకారమని అంటారేమో. నేనైతే నేపెరిగిన వాతావరణం, మీరు చిక్కున్నట్లు గానే, నేను చిక్కుకున్న నా భావజాల ప్రభావం అని భావిస్తాను. మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా.

చిన్న సలహా (నచ్చకపోతే జష్ట్ ఇగ్నోర్ )

నా కామెంటుకు మీరిచ్చిన సమాధానంలో చాలా సభ్యత, సంస్కారం, మంచి వాదనా పటిమ కనిపించినయ్. (నిజం చెప్పాలంటే మీరు ఏ ఏ పదాలు వాడి అవమానిస్తారో అని భయపడ్డాను కూడా) ఇలాంటి ధోరణినే మన ఇతర మిత్రులతో ఎందుకు చూపరు. కొంచెం హుందాగా ఉంటుంది కదా.
మా సంస్కృతే అది అని నాకు చెప్పద్దు. నేను నమ్మను.

అభినందనలతో
బొల్లోజు బాబా

naveen achari said...

తెలంగాణ నుంచి ఆంధ్రాకు వలసలు తక్కువగానే జరిగిన మాట వాస్తవమే. నేను తెలంగాణ బిడ్డను. తిమ్మిని బమ్మి చేసే అవసరం నాకు లేదు. ఐతే ఇక్కడ విషయం ఏంటంటే అంధ్రా నుంచి తెలంగాణ కు వలసలు ఎక్కువగా జరిగినయి కాబట్టి ఎక్కువ (వేల సంఖ్యలో) పదాలు తెలంగాణ తెలుగులో కలిసినయి. ఐతే తెలంగాణ నుంచి ఆంధ్రా కు వలసలు జరిగినప్పుడు అన్ని కాకపోయినా కనీసం కొన్ని పదాలైనా తెలంగాణవి అక్కడికి రావాలి కదా..!! వేలుకాకపోయినా వందలైన ..కనీసం పది ఐనా రావాలి కదా..!! ఏవీ ఎక్కడ..?

నువ్వు చెప్పిన గురు అన్న మాట రావడానికి కారణం దాన్ని భారత ఆధ్యాత్మిక పదం గా ప్రయోగిస్తుంటారు. అంతే కాని క్లాసు రూం లో ఉపాధ్యాయుడికి ఈ పదం వాళ్లు కూడా వాడట్లేదు. ఇక శాంతి అనే పదం (అంతగా అక్కడ పాపులర్ కాదు) మనం ఎక్కువగా శ్లోకాల్లో వాడడం వల్ల అక్కడికి వెళ్లింది. ఇవి కాకుండా మిగతావి నువ్వే గమనించు. దాదాపు వందకోట్ల పైచిలుకు భారత సమాజం ఇంగ్లీష్ లోకి పంపిన పదాలు కొన్ని మాత్రమే. అవీ 20 లోపు. అదే ఇంగ్లీష్ పదాలు లేని భాష ఈ ప్రపంచం లో ఎదైనా ఉందా..? మన తెలుగు లోనే ఎన్ని వేల ఆంగ్ల పదాలను మనం ప్రతీ రోజు వాడుతామో మనకే తెలీదు.

అంతెందుకు మా తెలంగాణ ఎప్పుడూ ఇంగ్లీష్ వారి ఏలుబడి లో లేదు. వారి వలసలు కూడా ఇక్కడకు లేవు. ఐనా ఇక్కడ ఆంగ్ల పదాలు వాడుతాం. ఏమిటి కారణం. అంతర్జాతీయ భాష అనే కదా..!!

ఇంగ్లీష్ వాళ్లు ఇక్కడికి వచ్చింది వేలల్లో. ఐనా ఇంగ్లీష్ పదాలు వేల సంఖ్యలో వచ్చి పడ్డాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కాని భారతీయులు ఇప్పుడు అక్కడున్నది కోట్ల సంఖ్యలో. ఐనా ఎన్ని భారతీయ పదాలు అటు వెళ్లినయో నువ్వే చెప్పు. వలసలే కారణం ఐతే మన పదాలు అక్కడ ఎక్కువగా ఉండాలి కదా. ఏవీ మరి..? ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ వారు ఇక్కడినుండి వెళ్లిన తర్వాతే ఇక్కడ ఇంగ్లీష్ ప్రభావం పెరిగింది. ఇంగ్లిష్ భాషకున్న అంతర్జాతీయ అధికార హోదానే అందుకు కారణం. వలసలు ఎంతమాత్రమూ కాదు.

నేను ఏ భావజాలం లోనూ చిక్కుకోలేదు. నేను చెప్పింది తప్పైతే నన్ను నేను మార్చుకోడానికి సిద్ధంగా ఉన్నా.

ఇక నీ సలహా గురించి.

ఆయనకు మా భాషా (సంస్కృతి అని చెప్పలేదు..కొంచెం మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడండి ..Hope u know the difference) అని చెప్పింది ఏకవచన ప్రయోగం గురించి. అక్కడ అదే చెప్పాను. మళ్లీ చదవండి. పెడార్థాలు తీయొద్దు.


ఇక మిగితావి.
విషయం మీద మాట్లాడినప్పుడు ఎవరైనా విలువనిస్తారు. అదికకుండా విషయాణ్ని పక్కనపెట్టి మాత్లాడడం, కొద్దిసేపు మాట్లాడి అది కుదరకపోతే ఇంకోటి మత్లడడం... వీతికి జవాబులు ఇలాగే ఉంటాయి. తెలంగాణ భాషకు సముచిత స్థానం అదిగితే ఒకాయన "చిన్నబుద్ది" అంటాడు. అదేదో దేశద్రోహం అయినట్టు.

ఇంకొకాయన ప్రామాణిక భాషగా ఆంధ్ర భాషే ఎందుకు అంటే మీ భాష మాట్లడడం మీకే నామోషీ అంటడు. ఇది సమాధానమా..? అధికారం లో లేని భాషను మాట్లాడే వారు న్యూనతా భావానికి గురి కావడానికి కారణం ఎవరు. ఎవరి భాషనైతే తెలంగాణ ప్రజలు ఆదరించారో వారు తమ భాషనే అవమానించడం ఇందుకు కారణం కాదా..!! వీళ్లకు నా సమాధానాలు ఇలాగే ఉంటాయి. అందుకే నేననేది అన్ని భాషలకు ప్రాతినిథ్యం అసాధ్యమైనప్పుడు తమ రాష్ట్రం లోనే తమ భాషను అధికార భాష చెయ్యడానికి తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. (తెలంగాణ రాష్ట్రోద్యమ కారణాల్లో భాషా పరిరక్షణ కూడా ఒకటి)

మి సలహాను తిరస్కరిస్తున్నాను. క్షమించాలి.

మా కవులు చెప్పినట్టు ఎవడు అధికారం లో ఉంటే వాడి భాష రాజ్యమేలింది. అది ఇంగ్లీష్ ఐనా..ఉర్దూ/అరబ్బీ ఐనా.. ఇప్పుడు ప్రామాణికం అని మీరంటున్న ఆంధ్ర తెలుగైనా. అందుకే వీరి భాషా ఫాసిజం నాశించాలి. అన్ని భాషలూ వెల్లివిరియాలి. సకల సంస్కృతులు పరిఢవిల్లాలి. రంగు రంగు పువ్వులం భరతమాత బిడ్డలం. ఆ స్ఫూర్తి అవసరం.

-నవీన్ ఆచారి

Affordable Luxurious Wedding Dress Blog said...

cheap wedding gowns,
discount bridal gowns,
China wedding dresses,
discount designer wedding dresses,
China wedding online store,
plus size wedding dresses,
cheap informal wedding dresses,
junior bridesmaid dresses,
cheap bridesmaid dresses,
maternity bridesmaid dresses,
discount flower girl gowns,
cheap prom dresses,
party dresses,
evening dresses,
mother of the bride dresses,
special occasion dresses,
cheap quinceanera dresses,
hot red wedding dresses