Wednesday, September 13, 2006

Hats off to Madhu తెలంగాణాపై ఆత్మవంచన చేసుకోను

తెలంగాణాపై ఆత్మవంచన చేసుకోను

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆన్‌లైన్‌): 'ఎవరికో భయ పడి, ఏదో ఆశించి తెలంగాణపై మౌనంగా ఉండే ప్రసక్తిలేదు. అది ఆత్మవంచనే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న భయంలేదు నాకు. గత ఎన్నికల్లో తెలంగాణ హామీ ఇచ్చి గెలిచాము. ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలన్నదే నా ఆశయం. ఈ గడ్డపై పుట్టినందుకు తెలంగాణ తల్లి రుణం తీర్చుకుం టాను' అని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి మధుగౌడ్‌ యాస్కీ స్పష్టం చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌ సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికలకు ముందు నేను రాజకీయాలకు కొత్త. పోతిరెడ్డి పాడు వివాదం ఏమిటో చెప్పమని అప్పటి టిఆర్‌సిసి కన్వీనర్‌ చిన్నారెడ్డిని అడిగాను. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టం. దీనిని ప్రతిఘటించాలని ఆయన చెప్పారు. అదే చిన్నారెడ్డి ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుసు. మావాళ్లు (కాంగ్రెస్‌ నాయకులు) ఎన్నికలకు ముందు ఏమి మాట్లాడారో, ఇప్పుడెలా మాటమార్చుతున్నారో 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో ఇటీవల వరుసగా ప్రచురించిన విషయం మీకు తెలుసు. ఎందుకిలా జరుగుతున్నదో మీకు తెలుసు. నేను మాత్రం ఎవరికో భయపడి, ఏదో ఆశించి మౌనంగా ఉండబోను' అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 400 కోట్ల రూపాయల పనులు చేశాం. అక్కడ తెలుగుదేశానికి అధికంగా ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడా అలాగే జరిగింది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటు న్నారో తెలియడం లేదా?' అని ఆయన ప్రశ్నించారు. 'కెసిఆర్‌ రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటులో నరేంద్ర ప్రసంగిస్తుంటే ఆయనపై ఎదురుదాడి చేయాలని సిద్ధమవు తుంటే నేను సిద్ధిపేట ఎంపి సర్వే సత్యనారాయణను అడి గాను- మీరు తెలంగాణను కోరుకుంటున్నారా లేదా అని. లేదు నాకు తెలంగాణ కావాలనే ఉందన్నారు ఆయన. మరి అటువంటప్పుడు తెలంగాణ కోసం ఎవరో ఒకరు మాట్లాడు తుంటే మనమెందుకు అడ్డుకోవాలని ప్రశ్నించాను' అని మధుగౌడ్‌ చెప్పారు. పిసిసి అధ్యక్షుడు కేశవరావుతో పాటు తెలంగాణ ప్రాంత ఎంపీలను, ఎమ్మెల్యేలను తాను స్వయంగా అడిగానని, అందరూ తెలంగాణ కావాలని అంటూనే పదవుల కోసం తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్‌లో నాడు చెన్నారెడ్డి, నేడు చిన్నారెడ్డి వంటి వాళ్లు ఎప్పుడూ ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎంపీలు అయి ఉండి తెలంగాణ కోసం ఎందుకు మాట్లాడరని అడిగితే, 'నేను ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నానని, భూములు కొనుక్కుంటున్నానని నన్ను వదిలేయండి' అని ఒక ఎంపీ తప్పించుకున్నారని మధుగౌడ్‌ వెల్లడించారు. తెలం గాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని, టిఆర్‌ఎస్‌ను బలహీనపరిస్తే అది కాంగ్రెస్‌కే నష్టమని తాను సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీ లకు చెప్పానని ఆయన తెలిపారు. 'తెలంగాణపై ఇక చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం ఇది. తెలంగాణలోని కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై బహిరంగంగా మాట్లాడాలి' అని ఆయన కోరారు. తాను కాంగ్రెస్‌లో ఉంటూనే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడతానని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలలోనే సత్వరాభివృద్ధి సాధ్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటేక్‌ సింగ్‌ అహ్లూవాలియా కూడా చెప్పారని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌లో మధుయాస్కీ కలకలం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆన్‌లైన్‌) ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను బహిరంగ పరుస్తూనే.. ఈ ప్రాంత నేతలపై నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు మధు యాస్కీ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా టిఆర్‌సిసిసి కన్వీనర్‌ జి.చిన్నారెడ్డిపై ఆయన చేసిన విమర్శలు కాంగ్రెస్‌ లో కలకలాన్ని రేపుతున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్‌ బ్రదర్స్‌ మర్రి శశిధర్‌రెడ్డి, పి.జనార్ధన్‌రెడ్డిలు మాత్ర మే పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ అధిష్టానానికి నివేదికలు పంపుతూ కంట్లో నలుసుగా ఉన్నా రు. ఇప్పుడు మధుయాస్కీ గౌడ్‌ కూడా వారికి తోడయ్యా రు. మధు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు బహిరంగంగా ఖండించలేకపోతున్నారు.

ఇప్పుడు తామేం మాట్లాడినా తెలంగాణకు వ్యతిరేకులుగా అపప్రదను మూటగట్టుకోవా ల్సి వస్తుందని వారు భయపడుతున్నారు. అమెరికాలో న్యాయవాద వృత్తిని చేపట్టి ఆర్థికంగా స్థిరపడిన మధు యాస్కీగౌడ్‌ 2004లో జరిగిన ఎన్నికల్లో అప్పటి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆశీస్సులతో నిజామాబాద్‌ పార్ల మెంటు స్థానం నుంచి కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. మృదుస్వభా విగా కన్పించే మధుయాస్కీగౌడ్‌లో ప్రాంతీయాభిమానం మెండుగా కన్పిస్తుంది. తెలంగాణ ప్రాంత రైతాంగానికి నష్టం కలిగించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కేసు వేసి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇటీవల తెలంగాణ అంశం చర్చకు వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలు అధికంగా ఉన్నాయని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరించారు.

ఈ సందర్భంలో ఆమె పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావును ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలను బహిర్గతం చేశారు. ఆ వ్యాఖ్యల ను పిసిసి అధ్యక్షుడు తోసి పుచ్చలేదు. పైగా అవన్నీ వాస్తవాలేనని సమర్థించారు. కానీ మంగళవారం చిన్నారెడ్డిపై మధు చేసిన వ్యాఖ్యలను కేకే సీరియస్‌గా తీసుకున్నారు. 'చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు మిత్రుడు మధుయాస్కీ భారత దేశంలోనూ, రాష్ట్రంలో నూ, ఈ ప్రాంతంలోనూ లేరు... వాస్తవాలు తెలుసుకుంటే మంచిది' అని కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి కూడా మధు వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఈ వ్యాఖ్యలను ఖండించాల్సిందిగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను కొందరు కోరారు. వారి సూచనను ఆ ఎమ్మెల్యే పాటించలేదు. పైగా.. ఎన్నికల సమయంలో పార్టీలోకి తీసుకువచ్చి.. పార్లమెంటు టిక్కెట్టును ఇచ్చిన వారినే ఖండించమని చెప్పండని ఆ ఎమ్మెల్యే ఖరాఖండీగా చెప్పారు. రాజీనామాలు, ఉపసంహరణల నేపథ్యంలో ఇప్పుడు తెలం గాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల్లో ప్రత్యేక తెలంగాణ అంశంపై మాట్లాడాలో.. వద్దో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది.

మధుయాస్కీని చుసి మిగితా కాంగ్రెస్ వాల్లు శెరం తెచ్హుకొవాలి