Sunday, September 17, 2006

Settler MP కి చెప్పుదెబ్బ లాంటి జవాబు

మర్యాదగా మాట్లాడండి రేణుకకు మధుయాష్కీ సలహా
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ సహచరుడినుద్దేశించి కాస్తంత మర్యాదగా మాట్లాడాలని కేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఎంపీ మధుగౌడ్‌ యాష్కీ సలహా ఇచ్చారు. ఆయనా ఓ నాయకుడేనా? అంటూ రేణుక చేసిన వ్యాఖ్యల్ని ఆదివారమిక్కడ ఖండించారు. 'నేను కూడా ప్రజలెన్నుకున్న ప్రతినిధినే. ఆమెకు జవాబును గట్టిగా మరింత సమర్థంగా చెప్పగలను. కానీ నేను కూడా అలా మాట్లాడితే ఇక ఆమెకూ నాకూ తేడా ఏముంటుంది?' అని మధుగౌడ్‌ వ్యాఖ్యానించారు.