మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మనుశులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనకు పని చేసుడు శాతకాదు అన్నోడు, మనది తెలుగే కాదన్నోడు శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.
-నవీన్ ఆచారి
Thursday, September 21, 2006
Sunday, September 17, 2006
Settler MP కి చెప్పుదెబ్బ లాంటి జవాబు
మర్యాదగా మాట్లాడండి రేణుకకు మధుయాష్కీ సలహా
హైదరాబాద్, న్యూస్‌టుడే: లోక్‌సభ సహచరుడినుద్దేశించి కాస్తంత మర్యాదగా మాట్లాడాలని కేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఎంపీ మధుగౌడ్ యాష్కీ సలహా ఇచ్చారు. ఆయనా ఓ నాయకుడేనా? అంటూ రేణుక చేసిన వ్యాఖ్యల్ని ఆదివారమిక్కడ ఖండించారు. 'నేను కూడా ప్రజలెన్నుకున్న ప్రతినిధినే. ఆమెకు జవాబును గట్టిగా మరింత సమర్థంగా చెప్పగలను. కానీ నేను కూడా అలా మాట్లాడితే ఇక ఆమెకూ నాకూ తేడా ఏముంటుంది?' అని మధుగౌడ్ వ్యాఖ్యానించారు.

Saturday, September 16, 2006
గులాబి కండవాతో గెలిచామా!...సిగ్గుచేటు
గులాబి కండవాతో గెలిచామా!...సిగ్గుచేటు! సర్వే' ప్రకటనపై పరోక్షంగా ధ్వజమెత్తిన రాజగోపాల్
విజయవాడ, సెప్టెంబర్ 16 (ఆన్‌లైన్): సోనియాగాంధీ చేసిన పదవీ త్యాగాలు, వైఎస్ పాదయాత్రలతో గెలుపొందిన కాంగ్రెస్ నాయకులు గులాబి కండువా వేసుకుని గెలిచామనడం సిగ్గుచేటైన విషయమని విజయవాడ ఎంపి రాజగోపాల్ అన్నారు. విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా జరిగిన సభలో రాజగోపాల్ ఆవేశంతో మాట్లాడారు. తన సహచర ఎంపి అయిన సిద్దిపేట ఎంపి సర్వే సత్యనారాయణపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌ను తెలంగాణా ముద్దుబిడ్డగా వర్ణించడంతోపాటు, తాను గులాబి కండువాతో గెలిచానని'సర్వే' చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ మండిపడ్డారు. ఆ మహానుభావుడు చేసిన ప్రకటన చదువుతుంటే తనకు కన్నీటి తెరలు అడ్డువచ్చాయని అన్నారు.

సొంతాగా బతకలెని మీకు సిగ్గు కుడావుందా. అంత పొడింగుగాలె ఐత్ సొంతాగా బతకండిరా తెలంగానని దొచుకొకుందా..
Wednesday, September 13, 2006
address లెనివాడు అడ్డుపదితె ఎంత అడ్డుపదకపొతె ఎంత...!!!
ప్రజలు కోరితే అడ్డుపడం :: తెలంగాణపై సీహెచ్.రాజేశ్వరరావు
హైదరాబాద్, న్యూస్‌టుడే: ''సాధారణ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్పునిస్తే మా పార్టీ అడ్డుపడదు. ప్రత్యేక తెలంగాణను మేమేమన్నా అడ్డుకుంటామన్నామా? మెడ కోసుకుంటామన్నామా? ఆత్మహత్య చేసుకుంటామన్నామా? అయితే... ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్న ఆలోచనే నా వరకు నాకు ఊహాతీతమైనది. అది ఎన్నటికీ సాధ్యం కానిది'' అని తెదేపా సీనియర్ నేత సీహెచ్.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎవరికి వారు తమ కోపతాపాల కోసం, ట్రిక్కులు, గిమ్మిక్కుల కోసం సవాళ్లు చేయడం, రాజీనామాలు చేసుకోవటం అన్న వాటికి ప్రజాస్వామ్యంలో విలువ లేదని బుధవారమిక్కడ చెప్పారు. ఉపఎన్నిక ఫలితం తెలంగాణకు రిఫరెండమ్ కాదన్నారు. ఒకవేళ కేసీఆర్ రాజీనామాతో ఉప ఎన్నిక జరిగితే తెదేపా తరఫున అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు

తెలంగాణలొ address లెని తెదేపా అడ్డుపదితె ఎంత అడ్డుపదకపొతె ఎంత,తెదేపా(TDP) అంటె తెలంగాణ ద్రొహుల పార్టి అని మారొసారి నిరుపించుకుంటుంది.
రైతుల ఆత్మహత్యలపై సిఎం అంగీకారం
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అంగీకరించారు. ఈ విషయంలో నిజాలను దాచిపెట్టకుండా తాము పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. ఆత్మహత్యలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 303 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని, తాము అధికారంలోకి వచ్చాక 1501 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయదారులకు రోజుకు ఏడు గంటలసేపు విద్యుత్ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్ సబ్ స్టేషన్లపై దాడి చేస్తున్న రైతులను ఆయన విమర్శించారు. వారు రాజకీయ రైతులని ఆయన అభివర్ణించారు.
Hats off to Madhu తెలంగాణాపై ఆత్మవంచన చేసుకోను
తెలంగాణాపై ఆత్మవంచన చేసుకోను
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆన్‌లైన్): 'ఎవరికో భయ పడి, ఏదో ఆశించి తెలంగాణపై మౌనంగా ఉండే ప్రసక్తిలేదు. అది ఆత్మవంచనే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న భయంలేదు నాకు. గత ఎన్నికల్లో తెలంగాణ హామీ ఇచ్చి గెలిచాము. ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలన్నదే నా ఆశయం. ఈ గడ్డపై పుట్టినందుకు తెలంగాణ తల్లి రుణం తీర్చుకుం టాను' అని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపి మధుగౌడ్ యాస్కీ స్పష్టం చేశారు. మంగళవారం బషీర్‌బాగ్ సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికలకు ముందు నేను రాజకీయాలకు కొత్త. పోతిరెడ్డి పాడు వివాదం ఏమిటో చెప్పమని అప్పటి టిఆర్‌సిసి కన్వీనర్ చిన్నారెడ్డిని అడిగాను. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టం. దీనిని ప్రతిఘటించాలని ఆయన చెప్పారు. అదే చిన్నారెడ్డి ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుసు. మావాళ్లు (కాంగ్రెస్ నాయకులు) ఎన్నికలకు ముందు ఏమి మాట్లాడారో, ఇప్పుడెలా మాటమార్చుతున్నారో 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో ఇటీవల వరుసగా ప్రచురించిన విషయం మీకు తెలుసు. ఎందుకిలా జరుగుతున్నదో మీకు తెలుసు. నేను మాత్రం ఎవరికో భయపడి, ఏదో ఆశించి మౌనంగా ఉండబోను' అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 400 కోట్ల రూపాయల పనులు చేశాం. అక్కడ తెలుగుదేశానికి అధికంగా ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా అలాగే జరిగింది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటు న్నారో తెలియడం లేదా?' అని ఆయన ప్రశ్నించారు. 'కెసిఆర్ రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటులో నరేంద్ర ప్రసంగిస్తుంటే ఆయనపై ఎదురుదాడి చేయాలని సిద్ధమవు తుంటే నేను సిద్ధిపేట ఎంపి సర్వే సత్యనారాయణను అడి గాను- మీరు తెలంగాణను కోరుకుంటున్నారా లేదా అని. లేదు నాకు తెలంగాణ కావాలనే ఉందన్నారు ఆయన. మరి అటువంటప్పుడు తెలంగాణ కోసం ఎవరో ఒకరు మాట్లాడు తుంటే మనమెందుకు అడ్డుకోవాలని ప్రశ్నించాను' అని మధుగౌడ్ చెప్పారు. పిసిసి అధ్యక్షుడు కేశవరావుతో పాటు తెలంగాణ ప్రాంత ఎంపీలను, ఎమ్మెల్యేలను తాను స్వయంగా అడిగానని, అందరూ తెలంగాణ కావాలని అంటూనే పదవుల కోసం తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్‌లో నాడు చెన్నారెడ్డి, నేడు చిన్నారెడ్డి వంటి వాళ్లు ఎప్పుడూ ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎంపీలు అయి ఉండి తెలంగాణ కోసం ఎందుకు మాట్లాడరని అడిగితే, 'నేను ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నానని, భూములు కొనుక్కుంటున్నానని నన్ను వదిలేయండి' అని ఒక ఎంపీ తప్పించుకున్నారని మధుగౌడ్ వెల్లడించారు. తెలం గాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని, టిఆర్‌ఎస్‌ను బలహీనపరిస్తే అది కాంగ్రెస్‌కే నష్టమని తాను సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీ లకు చెప్పానని ఆయన తెలిపారు. 'తెలంగాణపై ఇక చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం ఇది. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై బహిరంగంగా మాట్లాడాలి' అని ఆయన కోరారు. తాను కాంగ్రెస్‌లో ఉంటూనే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడతానని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలలోనే సత్వరాభివృద్ధి సాధ్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటేక్ సింగ్ అహ్లూవాలియా కూడా చెప్పారని ఆయన అన్నారు.
కాంగ్రెస్‌లో మధుయాస్కీ కలకలం
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆన్‌లైన్) ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను బహిరంగ పరుస్తూనే.. ఈ ప్రాంత నేతలపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాస్కీ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా టిఆర్‌సిసిసి కన్వీనర్ జి.చిన్నారెడ్డిపై ఆయన చేసిన విమర్శలు కాంగ్రెస్ లో కలకలాన్ని రేపుతున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్ బ్రదర్స్ మర్రి శశిధర్‌రెడ్డి, పి.జనార్ధన్‌రెడ్డిలు మాత్ర మే పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ అధిష్టానానికి నివేదికలు పంపుతూ కంట్లో నలుసుగా ఉన్నా రు. ఇప్పుడు మధుయాస్కీ గౌడ్ కూడా వారికి తోడయ్యా రు. మధు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు బహిరంగంగా ఖండించలేకపోతున్నారు.
ఇప్పుడు తామేం మాట్లాడినా తెలంగాణకు వ్యతిరేకులుగా అపప్రదను మూటగట్టుకోవా ల్సి వస్తుందని వారు భయపడుతున్నారు. అమెరికాలో న్యాయవాద వృత్తిని చేపట్టి ఆర్థికంగా స్థిరపడిన మధు యాస్కీగౌడ్ 2004లో జరిగిన ఎన్నికల్లో అప్పటి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆశీస్సులతో నిజామాబాద్ పార్ల మెంటు స్థానం నుంచి కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. మృదుస్వభా విగా కన్పించే మధుయాస్కీగౌడ్‌లో ప్రాంతీయాభిమానం మెండుగా కన్పిస్తుంది. తెలంగాణ ప్రాంత రైతాంగానికి నష్టం కలిగించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కేసు వేసి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇటీవల తెలంగాణ అంశం చర్చకు వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలు అధికంగా ఉన్నాయని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరించారు.
ఈ సందర్భంలో ఆమె పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావును ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలను బహిర్గతం చేశారు. ఆ వ్యాఖ్యల ను పిసిసి అధ్యక్షుడు తోసి పుచ్చలేదు. పైగా అవన్నీ వాస్తవాలేనని సమర్థించారు. కానీ మంగళవారం చిన్నారెడ్డిపై మధు చేసిన వ్యాఖ్యలను కేకే సీరియస్‌గా తీసుకున్నారు. 'చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు మిత్రుడు మధుయాస్కీ భారత దేశంలోనూ, రాష్ట్రంలో నూ, ఈ ప్రాంతంలోనూ లేరు... వాస్తవాలు తెలుసుకుంటే మంచిది' అని కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి కూడా మధు వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఈ వ్యాఖ్యలను ఖండించాల్సిందిగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొందరు కోరారు. వారి సూచనను ఆ ఎమ్మెల్యే పాటించలేదు. పైగా.. ఎన్నికల సమయంలో పార్టీలోకి తీసుకువచ్చి.. పార్లమెంటు టిక్కెట్టును ఇచ్చిన వారినే ఖండించమని చెప్పండని ఆ ఎమ్మెల్యే ఖరాఖండీగా చెప్పారు. రాజీనామాలు, ఉపసంహరణల నేపథ్యంలో ఇప్పుడు తెలం గాణ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో ప్రత్యేక తెలంగాణ అంశంపై మాట్లాడాలో.. వద్దో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది.

మధుయాస్కీని చుసి మిగితా కాంగ్రెస్ వాల్లు శెరం తెచ్హుకొవాలి
Subscribe to:
Posts (Atom)